సమంతకు చెర్రీ బావ అవుతాడట ! .. ఎలానో తెలుసా !

సమంతకు రామ్‌చరణ్ బావ అవుతాడని అంటున్నారు. అదేంటి ఇదేం కొత్త రిలేషన్ అని ఆశ్చర్యపోతున్నారా..? రియల్ లైఫ్ లో కాదులెండి.. ఓ సినిమాలో. రామ్‌చరణ్- సమంత హీరోహీరోయిన్లుగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రానున్న ఈసినిమాలో సమంత.. చెర్రీకి మరదలుగా తెరపై కనిపించనుందని ఫిలింనగర్‌లో వార్త హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తి నెలకొల్పేలా ఉంటాయని అంటున్నారు. దేవి శ్రీ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో విడుదలకానుంది.

జగపతిబాబు, అనసూయ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈసినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మరోవైపు ఓంకార్ దర్శకత్వంలో మామ అక్కినేని నాగార్జునతో సమంత నటించిన 'రాజు గారి గది 2' ఈ నెల 13వ తేదీన విడుదలకానుంది.

No comments

Powered by Blogger.