వదినకు అఖిల్ అదిరిపోయే సర్‌ప్రైజ్

గోవాలో ప్రముఖుల మధ్య జరుగుతోన్న నాగచైతన్య, సమంతల వివాహంలో నాగ్ తనయుడు, నాగచైతన్య తమ్ముడు తనకు కాబోయే వదిన కోసం ఓ సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అదేమంటే  అక్కినేని కుటుంబంలోకి సమంతని ఆహ్వానిస్తూ, అదిరిపోయేలా ఓ వీడియోని అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి అఖిల్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరిపినట్లుగానూ, ఈ వీడియో గురించి సమంతకి కానీ, నాగచైతన్యకి కానీ తెలియకుండా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

పెళ్లి జరిగే టైమ్‌లో సర్‌ప్రైజ్‌గా ఈ వీడియోని ప్రసారం చేసి నూతన జంటకి షాక్ ఇవ్వాలని వీరంతా ప్లాన్ చేశారంట. ఈ వీడియో ప్రత్యేకంగా సమంత కోసం చేసింది కావడంతో, గ్యారంటీగా సమంతకు సర్‌ప్రైజ్‌ని ఇస్తుందని ఇరు ఫ్యామిలీ సభ్యులు భావిస్తున్నారంట. మరి ఆ సర్‌ప్రైజ్ ఏమిటో మనకు తెలియాలంటే మాత్రం పెళ్లి అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.

No comments

Powered by Blogger.