షాక్ : హీరోయిన్స్‌తో లిప్ కిస్సులకు కూడా రెడీ : విద్యాబాలన్


ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే ఆ ఉత్తరాది భామ, అవసరమనుకుంటే హీరోయిన్స్‌తో లిప్ కిస్సులకు కూడా రెడీ అంటోంది. విద్యాబాలన్ టాలెంట్ ఏ పాటిదో చెప్పడానికి ఒక్క 'డర్టీ పిక్చర్' చాలు. అందులో ఆమె పోషించిన పాత్రను బట్టి ఆమె ఎన్నుకొనే పాత్రల్ని అంచనా వేయొచ్చు. హీరోయిన్ అన్నాక అన్నీ పాత్రలు పోషించాలన్నదే ఆమె సిద్ధాంతం. చేసే పాత్ర బోల్డా, హోమ్లీ నా అన్నది చూడకూడన్నది ఆమె ఆలోచన.

అర్షద్ వార్సి, ఇమ్రాన్ హష్మీ, మాధవన్‌లకు చాలా సినిమాల్లో ఘాటైన ముద్దులు పెట్టిన విద్యాబాలన్ అవసరమనుకుంటే హీరోయిన్స్‌కు కూడా ముద్దులు పెట్టడానికి రెడీనట. ఆ తరహా పాత్రలు చేయడానికి ఆమె వెనుకాడదట. పాత్ర ముఖ్యంగాని, ఏ తరహా పాత్ర అనేది విద్యాబాలన్ ఆలోచించిందట.

లెస్బియన్ తరహా పాత్రలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, సినిమాలో అందుకు తగ్గట్టు సన్నివేశాలుండాలని విద్యాబాలన్ సెలవిస్తోంది. ఇలా హీరోయిన్‌కి హీరోయిన్నే ముద్దులు పెట్టేస్తే ఆ తర్వాత హీరోలు పెట్టడానికి ఎవరూ మిగలరని ఆమె మీద సెటైర్లు వేసుకుంటున్నారట సినీజనం. మరి విద్యాబాలన్ భవిష్యత్తులో నిజంగానే లెస్బియన్ మూవీ చేస్తుందేమో చూడాలి.

No comments

Powered by Blogger.