అది గుర్తొచ్చినప్పుడల్లా గుండెపగిలిపోతోంది....!: శ్వేతాబసు ప్రసాద్ ఎమోషనల్ పోస్ట్ - Fast Telugu News

శ్వేతాబసు ప్రసాద్ ఎమోషనల్ పోస్ట్ :
'కొత్త బంగారులోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్.. మళ్లీ భావోద్వేగానికి గురైంది. 'కొత్త బంగారులోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా స్టార్ హీరోయిన్ హోదా మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లు లేకపోవటంతో తప్పటడుగులు వేసి కెరీర్ మొత్తాన్ని ప్రమాదంలో పడేసుకుంది.

శ్వేతబసు ప్రసాద్ :
'ఎ..కా....డా...' అంటూ ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్వేతబసు ప్రసాద్ అంతలోనే అవకాశాలు కరువై వ్యభిచారకూపంలో పడి మళ్లీ తేరుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. గడ్డు సమయంలో గుండె ధైర్యంతో పలువురి ప్రశంసలు పొందిన శ్వేత... తర్వాత అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చింది.

 చంద్ర నందిని :
సుమారు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఓ కవ్వాలి పాటలో శ్వేత అదరగొట్టింది. ఇక ఆ తర్వాత ఆత్మవిశ్వాసం తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది గానీ మళ్ళీ వెండి తెర అవకాశాలు మాత్రం రాలేదు. ఆనాటి పోలీస్ కేస్ అనంతరం సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో హిందీలో ‘చంద్ర నందిని' అనే టీవీ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్‌ షూటింగ్ నిన్నటితో ముగిసిపోవడంతో తన ఇన్ స్టా గ్రాంలో భావోద్వేగంతో నిండిన పోస్ట్‌ పెట్టింది.

ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉంటుంది :
అందులో ఏమందంటే...‘ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉంటుంది. అలాగే ‘చంద్ర నందిని' కూడా ముగిసింది. ఎంత బాధగా ఉందో చెప్పడానికి మాటలు రావడంలేదు. ఈ సీరియల్‌ లో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత ఏక్తా కపూర్‌ కి ధన్యవాదాలు. నా తోటి నటీనటులకు, ప్రొడక్షన్‌ బృందానికి కూడా ధన్యవాదాలు.

స్టూడియోకి వెళ్లే పనిలేదు :
రేపటి నుంచి చిత్రీకరణ కోసం స్టూడియోకి వెళ్లే పనిలేదు అని గుర్తొచ్చినప్పుడల్లా గుండెపగిలిపోతోంది. నన్ను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ధారావాహికలో నేను పోషించిన మహారాణి నందిని పాత్రను నేను ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ సీరియల్ లో నటించిన ఫోటోను పోస్టు చేసింది.

No comments

Powered by Blogger.